బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసుల చార్జ్‌షీట్.. నిందితుల్లో నటి హేమ
- మూడు నెలల క్రితం బెంగళూరు శివారులోని ఫాంహౌస్‌లో రేవ్‌పార్టీ
- దాడిచేసి 88 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
- పార్టీలో పాల్గొన్న హేమ సహా 79 మంది డ్రగ్స్ తీసుకున్నారంటూ పోలీసుల చార్జ్‌షీట్
- ఇదే కేసులో గతంలో అరెస్ట్ అయిన నటి హేమ
విజయవాడకు చెందిన వ్యాపారి ఎల్. వాసు యాజమాన్యంలోని ‘విక్టరీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ’ మూడు నెలల క్రితం బెంగళూరు శివారులోని హెబ్బగోడి జీఎం ఫాంహౌస్‌లో కంపెనీ తొలి వార్షికోత్సవాన్ని నిర్వహించింది. అయితే, ఈ వేడుకను కాస్తా రేవ్ పార్టీగా మార్చేశారని పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. పార్టీకి హాజరైన వారిలో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
ఇదే కేసులో గతంలో అరెస్ట్ అయిన హేమకు కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ కూడా విధించింది. ఆ తర్వాత కొన్ని షరతులతో ఆమెకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో జూన్ 14న బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు.