మాకు అమ్మాయి పుట్టింది... దీపిక పదుకొణే, రణవీర్ సింగ్ ప్రకటన
- బాలీవుడ్ కపుల్ దీపిక, రణవీర్ ఇంట కొత్త కాంతులు
- వెల్కమ్ బేబీ గాళ్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడి
- 2018 నవంబరులో పెళ్లి చేసుకున్న దీపిక, రణవీర్ సింగ్
దీపిక పదుకొనే ఈ నెల 7వ తేదీన ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లడంతోనే, ఆమె ప్రసవంపై ఊహాగానాలు బయల్దేరాయి. దీపిక పదుకొనే, రణవీర్ సింగ్ దంపతులకు ఇదే మొదటి సంతానం కావడంతో అందరి దృష్టి ఇటువైపే ఉంది.
చాలాకాలం పాటు ప్రేమలో కొనసాగిన దీపిక, రణవీర్ 2018 నవంబరులో పెళ్లితో ఒక్కటయ్యారు. ఆరేళ్ల తర్వాత తొలి సంతానానికి స్వాగతం పలికారు.