'కనబడుట లేదు' అంటూ కేసీఆర్ బొమ్మతో హైదరాబాద్ లో పోస్టర్లు
- తెలంగాణలో భారీ వర్షాలు
- ఇంతవరకు స్పందించని కేసీఆర్
- విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇంత విపత్తు జరిగినా కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. అయితే, ఈ పోస్టర్లను ఎవరు అతికించారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ వరదలతో ప్రజలు అల్లాడుతుంటే... మాజీ ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందన లేదని వారు విమర్శిస్తున్నారు.