డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
- ట్వీట్ చేసిన చంద్రబాబు
- ప్రజా జీవితంలో నిబద్ధత ఉన్న నాయకుడు అంటూ కితాబు
- రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలంటూ ఆకాంక్ష
"ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలురాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నాను. చలన చిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కల్యాణ్... రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
అంతేకాకుండా, పవన్ తో తాను కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు.