Jeedimetla: జీడిమెట్లలో విషాదం.. పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

Family committed suicide after killed their sons in Hyderabad
  • గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘటన
  • ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య
  • మృతులది మంచిర్యాల 
ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబం ఉసురు తీశాయి. తాము చనిపోతే పిల్లలు అన్యాయమైపోతారని భావించిన ఓ జంట తమ ఇద్దరు పిల్లల్ని చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన వెంకటేశ్ (40), వర్షిణి (33) భార్యాభర్తలు. వీరికి రిషికాంత్ (11), విహంత్ (3) సంతానం. గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వీరు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. వాటి నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తొలుత పిల్లలను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Jeedimetla
Hyderabad
Gajula Ramaram

More Telugu News