Ganja Smugling: కారు సీట్ల కింద రహస్య ఏర్పాట్లు చేసి గంజాయి తరలింపు

Smuglur Caught At Sangareddy District with 83 kgs Ganja
షార్ట్స్‌లో చూడండి
సినిమాల స్ఫూర్తితో స్మగ్లర్లు కొత్తకొత్త పద్ధతుల్లో అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నం చేసిన ఓ స్మగ్లర్ సంగారెడ్డిలో పట్టుబడ్డాడు. కారులో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని గంజాయిని తరలిస్తుండగా.. సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్ పోస్ట్ వద్ద దొరికిపోయాడు. నిందితుడు 83.4 కిలోల గంజాయిని మహారాష్ట్రకు తీసుకెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏవోబీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ఈ సరుకు విలువ సుమారు రూ.33.50 లక్షలు ఉండొచ్చని తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున కంకోల్ చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ కారులో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఆ కారును ఆపి జాగ్రత్తగా పరిశీలించారు. కారు సీట్ల కింది భాగంలో ఓ ప్రత్యేక పెట్టె ఏర్పాటు చేసి అందులో గంజాయిని దాచి తీసుకెళుతున్నట్లు గుర్తించారు. డ్రైవర్ ను అరెస్టు చేసి గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఆ వ్యక్తి చిత్తూరు జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Ganja Smugling
Sangareddy District
Kankole
83 kgs Ganja

More Telugu News