దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్.. ఏడుగురు జైలు సిబ్బందిపై వేటు
- ఫొటోలు, వీడియో బయటకు రావడంతో విచారణ జరిపించిన ప్రభుత్వం
- ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు
- సమగ్ర విచారణ జరిపిస్తామని హోంమంత్రి వెల్లడి
దర్శన్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో జైలు అధికారులలో ఏడుగురు దర్శన్ కు రాచమర్యాదలు చేస్తున్నట్లు గుర్తించామని, వారందరినీ వెంటనే సస్పెండ్ చేశామని హోంమంత్రి జి పరమేశ్వర మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాఫ్తు జరిపిస్తామని, ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.