అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహం
భారత సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. దీనికి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు భారీ మొత్తంలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జై వీర హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ భారీ విగ్రహంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించడం హైలైట్‌గా నిలిచింది.