సెప్టెంబర్ 3న 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు
- 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఈసీ
- ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల
- నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఆగస్టు 21
- సెప్టెంబర్ 3న ఎన్నికలు.. అదే రోజు ఓట్ల లెక్కింపు
అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. వీటిలో అస్సాం నుండి సర్బానంద సోనోవాల్, హర్యానా నుండి దీపేందర్ సింగ్ హుడా, రాజస్థాన్ నుండి కేసీ వేణుగోపాల్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పీయూష్ గోయల్ ఉన్నారు.
ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఆగస్టు 21. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అలాగే బీహార్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 27వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకునే వీలు ఉంది.