అమెరికా మహిళ తానే బంధించుకుందా?... వెలుగులోకి కొత్త ట్విస్ట్!
- అడవిలో గొలుసులతో కట్టేసిన స్థితిలో కనిపించిన మహిళ
- మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఘటన
- తాజాగా ఆశ్చర్యం కలిగించేలా పోలీసులకు వాంగ్మూలం
తాజాగా వాంగ్మూలంలో...
అమెరికన్ మహిళ కొంత మేర కోలుకున్న నేపథ్యంలో.. తాజాగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ సందర్భంగా ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది. తనను చెట్టుకు సంకెళ్లతో బంధించడం వెనుక ఇతరులెవరికీ సంబంధం లేదని.. తానే బంధించుకున్నానని ఆ అమెరికన్ మహిళ తెలిపింది. తాను మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నానని.. తనకు భర్త ఎవరూ లేరని పేర్కొంది.