AP Assembly: ముగిసిన బీఏసీ సమావేశం.. హాజరు కాని వైసీపీ.. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులంటే..!

AP BAC meeting
షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్ హాజరు కాగా... జనసేన తరపున నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. బీఏసీ సమావేశానికి వైసీపీ హాజరుకాలేదు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభలో శ్వేతపత్రాలను విడుదల చేయాలని అధికార పక్షం ప్రతిపాదించింది.
Go Back to Shorts
AP Assembly
BAC
YSRCP

More Telugu News