ఎంత విపత్తు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు: నిమ్మల రామానాయుడు ఆదేశాలు
- వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచాలన్న నిమ్మల
- వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత భవనాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశం
- ఏటిగట్ల పటిష్ఠతకు ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచుకోవాలన్న మంత్రి
తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో తుపాను రక్షిత భవనాలను సిద్ధం చేసుకోవాలని, అవసరమైన చోట్ల బోట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. డయేరియా, విష జ్వరాలు, పాము కాటుకు సంబంధించిన మందులను రెడీగా ఉంచుకోవాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా వారిని మత్స్యశాఖ అప్రమత్తం చేసిందని తెలిపారు. ఏటిగట్ల పటిష్ఠతకు ఇసుక బస్తాల వంటివాటిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.