ఆస్తిలో వాటా ఇవ్వలేదని తండ్రిని కారుతో ఢీకొట్టి చంపిన తనయుడు
- అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఘటన
- ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ. 16 లక్షల అప్పు చేసిన కుమారుడు
- వాటిని తీర్చేందుకు ఆస్తిలో వాటా కోసం పట్టు
- నిరాకరించిన తండ్రిని కారుతో ఢీకొట్టి హత్య
రఘునాథరెడ్డి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తూ దాదాపు రూ. 16 లక్షలు అప్పు చేసి నష్టపోయాడు. అప్పులు ఇచ్చిన వారు డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని తండ్రిని అడుగుతూ వస్తున్నాడు. దీంతో కొన్నేళ్లుగా తండ్రీకొడుకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
గతరాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. వాటా ఇచ్చేందుకు తండ్రి ససేమిరా అనడంతో కోపంతో ఊగిపోయిన రఘునాథరెడ్డి వాకింగ్ చేస్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టాడు. ఆపై బెంగళూరులో ఉంటున్న తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో విషయాన్ని బంధువులతోపాటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రాతంత్రా చిన్నరెడ్డప్ప కోసం గాలించారు. ఈ ఉదయం వీవర్స్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. శంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రఘునాథరెడ్డిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.