మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. ప్రధాన అనుచరుడితో పాటు పలువురు వైసీపీకి రాజీనామా
- పులిచెర్ల ఎంపీటీసీ మురళీధర్ రాజీనామా
- ఆయనతో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచుల రాజీనామా
- వైసీపీ ఓటమితో మారిపోతున్న పరిస్థితులు
అయితే, పరిస్థితి తారుమారయింది. తన నియోజకవర్గం పుంగనూరులో అడుగుపెట్టేందుకు కూడా పెద్దిరెడ్డి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పీటీసీ మురళీధర్ వైసీపీకి, జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పులిచెర్ల వైసీపీ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్, మరో నలుగురు ఎంపీటీసీలు, ఏడుగురు సర్పంచులు రాజీనామా చేశారు.