తిరుమల క్యూలైన్‌లో ఫ్రాంక్ వీడియో... విజిలెన్స్ విచారణకు ఆదేశించిన టీటీడీ
- దర్శన క్యూ లైన్లలో తమిళ ఆకతాయిల ఫ్రాంక్ వీడియో
- నారాయణగిరి షెడ్స్‌లోని కంపార్ట్‌మెంట్ తాళాలు తీసేందుకు యత్నిస్తూ వీడియో
- ఇన్‌స్టాగ్రాంలో వీడియో పోస్ట్... తమిళనాడులో ఆందోళనలు
అయితే అతను అలా చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న భక్తులు... వీరిని టీటీడీ సిబ్బందిగా భావించారు. తాళాలు తీస్తున్నారేమోనని ఆశగా చూశారు. కానీ వాసన్, అతని స్నేహితులు వెకిలిగా నవ్వుతూ అక్కడి నుంచి పరుగు తీశారు. చూస్తే అది ఫ్రాంక్ వీడియో.
దీనిని వారు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది.
సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు ప్రవేశించే ముందే భక్తుల నుంచి సెల్ ఫోన్లు డిపాజిట్ చేయిస్తారు. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారు మ్రోగే తిరుమల కంపార్ట్‌మెంట్‌లలో ఆకతాయిలు చేసిన ఫ్రాంక్ వీడియోపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.