తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ

15 IPS officers transferred in Telangana
  • శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్ నియామకం
  • గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర నియామకం
  • టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్ నియామకం
తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్, హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా విజయ్ కుమార్, టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్‌ను నియమించారు.

రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు, ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి, మల్టీజోన్-1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి, మల్టీజోన్-2 ఐజీగా సత్యనారాయణ, రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా రమేశ్ నాయుడు, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్ గిరిధర్, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షితమూర్తిని నియమించారు.
Go Back to Shorts
Telangana
IPS
Telangana Government

More Telugu News