ఇరాన్ అధ్యక్షుడిగా సంస్కరణవాది మసౌద్
- అల్ట్రాకన్జర్వేటర్ సయాద్ జలీల్‌పై విజయం
- మౌసద్‌కు విజయాన్ని అందించిపెట్టిన హామీలు
- ఆంక్షల వలయం నుంచి బయటపడేస్తానని, హెడ్‌స్కార్ఫ్ నిబంధనను సులభతరం చేస్తామని హామీ
- 30 మిలియన్ ఓట్లలో 16.3 మిలియన్ ఓట్లు మసౌద్‌కే
ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కుదిపేస్తున్న ఆంక్షలు, ఇటీవల దేశాన్ని కుదిపేసిన హెడ్‌స్కార్ఫ్ చట్టం అమలును సులభతరం చేస్తామన్న హామీలు మసౌద్‌కు విజయం చేకూర్చాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 30 మిలియన్ల మంది ఓటుహక్కు వినియోగించుకోగా మసౌద్‌కు 16.3 మిలియన్ ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి జలీల్‌కు 13.5 మిలయన్ ఓట్లు వచ్చాయి.