హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం: రేవంత్ రెడ్డి
- వరంగల్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష
- హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించాలని సూచన
- ఓఆర్ఆర్ నుంచి టెక్స్‌టైల్ పార్క్‌ను అనుసంధానించాలన్న సీఎం
ఇన్నర్, ఔటర్ రంగ్ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధుల వివరాలు ప్రభుత్వానికి అందించాలన్నారు. హైవేలను అనుసంధానిస్తూ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఉండేలా చూడాలన్నారు. ఓఆర్ఆర్ నుంచి టెక్స్‌టైల్ పార్కును అనుసంధానించాలన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలన్నారు. నాలాల ఆక్రమణను అరికట్టాలన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.