ఏపీ మాజీ మంత్రి అనిల్ పై నెల్లూరు మహిళ ఫిర్యాదు
- తన స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ ఆఫీస్ కడుతున్నారని ఆరోపణ
- గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి చుట్టూ తిరిగామని ఆవేదన
- న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన కౌసర్ జాన్
కబ్జా సూత్రధారి మాజీ మంత్రే..
తన స్థలాన్ని కబ్జా చేయడంలో సూత్రధారి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలకమని, అక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఆయనే శంకుస్థాపన చేశారని కౌసర్ జాన్ ఆరోపించారు. కష్టపడి పొదుపు చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన తన స్థలాన్ని తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని కౌసర్ మీడియాకు వెల్లడించారు.