ఇప్పటి వరకు 1301 మంది హజ్ యాత్రికుల మృతి
- సౌదీలో విపరీత వేడి పరిస్థితుల కారణంగా విషాదం
- హజ్ చరిత్రలో మూడో అతిపెద్ద విషాద ఘటన
- మృతుల్లో 660 మంది ఈజిప్షియన్లు
- 2015లో జరిగిన తొక్కిసలాటలో 2,400 మందకిిపైగా మృతి
చనిపోయిన వారిలో 660 మంది ఈజిప్షియన్లు ఉన్నారు. వారిలో 31 మంది అనధికారికంగా వచ్చిన వారే. ఈసారి ఈజిప్టు నుంచి 50 వేల మంది యాత్రికులు మక్కాను సందర్శించారు. ఇక, మృతుల్లో 165 మంది ఇండోనేషియా వారు కాగా, 98 మంది భారతీయులు ఉన్నారు. జోర్డాన్, ట్యునీషియా, మొరాకో, అల్జీరియా, మలేసియాకు చెందిన వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఇద్దరు అమెరికా పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
హజ్‌యాత్ర సందర్భంగా 2015లో మక్కాలోని మినాలో జరిగిన తొక్కిసలాటలో 2,400 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఘటన కాగా, అంతకుముందు 1990లో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది మృతి చెందారు. ఈసారి మక్కాలో 46 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడిని భరించలేక 1300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.