Dharmapuri Arvind: వారిని చేర్చుకోవడం ద్వారా, రేవంత్ రెడ్డి బీజేపీకి ద్వారాలు తెరుస్తున్నారు: ధర్మపురి అర్వింద్

Dharmapiri Arvind on Revanth Reddy joining bjp
షార్ట్స్‌లో చూడండి
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి ద్వారాలు తెరుస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కోరుట్లలో ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు ఇచ్చినవన్నీ మోసపూరిత వాగ్దానాలేనని విమర్శించారు. బెదిరించడం, సాయంత్రానికి డబ్బులు వసూలు చేసి సెటిల్మెంట్లు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

మున్ముందు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా పాలన చేస్తోందని విమర్శించారు. ప్రజలు మౌలిక వసతులు, తాగు, సాగునీరు, కరెంట్ కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 డిసెంబర్ తర్వాత తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని... అంటే అంతకుముందు రుణాల సంగతేమిటని ప్రశ్నించారు.
Go Back to Shorts
Dharmapuri Arvind
BJP
Revanth Reddy
Congress

More Telugu News