ఉరి వేసుకుని రీల్స్ చేసే యత్నం.. బిగుసుకుని యువకుడి మృతి
- వరంగల్ జిల్లా నర్సంపేటలో ఘటన
- ప్రమాదవశాత్తు బిగుసుకున్న ఉరి
- కుమారుడి మృతిపై తల్లి అనుమానం
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అక్కడ ఉరివేసుకుంటున్నట్టుగా వీడియో చిత్రీకరించాలని అనుకున్నాడు. దూలానికి ఉరి ఏర్పాటు చేసి ఫోన్‌ను ఫ్రిడ్జ్‌పై పెట్టాడు. వీడియో చిత్రీకరించే సమయంలో ఉరి నిజంగానే మెడకు బిగుసుకుపోయింది. నిన్న ఉదయం ఉరికి వేలాడుతున్న అజయ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అజయ్ మృతిపై తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.