రూ.279 రీఛార్జ్‌తో సరికొత్త ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్
- రూ.279 రీఛార్జ్‌తో 45 రోజుల వ్యాలిడిటీ అందించిన టెలికం దిగ్గజం
- 2 జీబీ డేటాకు మాత్రమే పరిమితం.. అపరమిత కాలింగ్ అవకాశం
- తక్కువ రీఛార్జ్‌తో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి సరిపోయే ప్లాన్
ఇక ఈ ప్లాన్‌లో భాగంగా అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్‌టెల్ అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ డేటా అవసరం లేకుండా.. తక్కువ ఖర్చుతో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలం. అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుండడం ఈ ప్లాన్‌లో చాలా విలువైన జోడింపుగా ఉంది.
ఎయిర్‌టెల్ కంపెనీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లలో ఈ రీఛార్జ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తక్కువ ధరకు ఎక్కువ కాలం వ్యాలిడిటీని అందిస్తున్న ఆఫర్‌గా ఉంది. కాగా ఇటీవలే ఎయిర్‌టెల్ 70 రోజుల వ్యాలిడిటీతో రూ.395 ప్లాన్‌ను ప్రకటించింది. వ్యాలిడిటీ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ ప్లాన్ కింద కూడా డేటా పరిమితంగానే ఉంది. డేటా ఎక్కువగా వాడేవారికి ఈ ప్లాన్లు అంత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు.