ఈవీఎం హ్యాకింగ్ ఎలా చేస్తారో నిరూపించేందుకు మస్క్ కు అవకాశం ఇవ్వాలి: పురందేశ్వరి
- ఈవీఎంల వాడకాన్ని బహిష్కరించాలంటున్న ఎలాన్ మస్క్
- హ్యాకింగ్ చేసే వీలుందని ఆందోళన
- కేంద్ర ఎన్నికల సంఘం ఎలాన్ మస్క్ ను ఆహ్వానించాలన్న పురందేశ్వరి
- ఈవీఎంలను ఇప్పటివరకు ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని వెల్లడి
ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటున్న ఎలాన్ మస్క్ ను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించాలని, ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో నిరూపించేందుకు ఆయనకు ఓ అవకాశం ఇవ్వాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఎన్నికల సంఘం చాలామందికి అవకాశం ఇచ్చిందని, కానీ ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.