USA: అమెరికాలో భార‌తీయుడి న‌గ‌ల దుకాణంలో చోరీ.. మూడు నిమిషాల్లో లూటీ.. వైర‌ల్ వీడియో!

20 Masked Robbers Clean Out Indian Jewellery Store in California in Under Three Minutes
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో బ్రాండెడ్ షోరూంల నుంచి కూడా దొంగ‌లు ద‌ర్జాగా వ‌స్తువుల్ని దోచుకెళ్తున్నారు. తాజాగా కాలిఫోర్నియాలో సినిమాల్లో చూపించే చోరీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓ భారత వ్యాపారికి చెందిన‌ నగల దుకాణంలో దోపిడీ జరిగింది. 

దుండగులు కేవలం మూడే మూడు నిమిషాల్లో దుకాణాన్ని లూటీ చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘ‌ట‌న తాలూకు సీసీటీవీ దృశ్యాలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. 

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. సుమారు 20 మంది ముసుగు దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు. షాపునకు కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డును భయపెట్టి, అద్దాల ద్వారం పగులకొట్టి వారు షాపులోకి ప్రవేశించారు. ఆ త‌ర్వాత వెంటనే షోరూం అంతా వ్యాపించి డెస్కుల అద్దాలను పగులగొట్టి అందినకాడికి ఆభ‌ర‌ణాల‌ను బ్యాగుల్లో వేసుకొని పరారయ్యారు. 

ఈ దోపిడీ తాలూకు దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అవి కాస్తా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. కాగా, లూటీ చేసిన దుండ‌గుల‌కు ప్రాంతం గురించి బాగా తెలిసినట్టు అనిపిస్తోందని స్థానిక మీడియా పేర్కొంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మిగ‌తావారి కోసం గాలిస్తున్నారు. 

కాగా, పూణె కేంద్రంగా ఉన్న బాధిత పీఎన్‌జీ జ్యువెల్లర్స్‌కు యూఎస్‌, దుబాయిలలో క‌లిపి 35 శాఖ‌లు ఉన్నాయి. ఈ సంస్థ‌ను పురుషోత్తం నారాయ‌ణ్ గాడ్గిల్ స్థాపించారు. ఒకే ఒక స్టోర్ నుంచి ఇవాళ ఈ కంపెనీ  గ్లోబ‌ల్ చైన్‌గా ఎద‌గ‌డం విశేషం.
Go Back to Shorts
USA
Indian Jewellery Store
California
NRI

More Telugu News