ప్రజలు ఓడించినా జగన్ రక్తచరిత్ర ఆపడంలేదు: లోకేశ్
- కర్నూలు టీడీపీ నేత గౌరీనాథ్ హత్యపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు
- హంతకులను వదిలేది లేదని సీరియస్ వార్నింగ్
- వైసీపీ దాడులకు చెక్ పెడతామని ప్రజలకు హామీ
జగన్ ఇప్పటికైనా హత్యా రాజకీయాలు ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేసమయంలో గౌరీనాథ్ హంతకులను వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గౌరీనాథ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడతామని, వైసీపీ దాడులకు చెక్ పెడతామని లోకేశ్ పేర్కొన్నారు.