Telugudesam: ఏపీలో టీడీపీ గెలుపు.. హైదరాబాద్‌లో సాక్షి కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి టీడీపీ శ్రేణుల సంబరాలు.. వీడియో ఇదిగో!

TDP Fans Celebrations Infront of Hyderabad Sakshi Head Office
  • టీడీపీ గెలుపు ఖరారు కాగా సాక్షి ఆఫీసు వద్దకు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు
  • కార్యాలయం బయట రోడ్డుపై టపాసులు పేల్చి డ్యాన్సులు
  • అడ్డుకునే సాహసం చేయలేకపోయిన సాక్షి సెక్యూరిటీ గార్డులు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి విజయం ఖరారు అయిన తర్వాత తెలంగాణలోని ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వైసీపీ దారుణంగా ఓడిపోతోందని తెలిసిన మరుక్షణం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఆ వెంటనే వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్న అభిమానులు రోడ్డుపై బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కారులో వచ్చిన వారు సాక్షి ఆఫీసు ముందు రోడ్డుపై ‘10 థౌజండ్ వాలా’ బాంబులు పేర్చి అంటించారు. అక్కడే ఉన్న సాక్షి సెక్యూరిటీ గార్డులు కూడా వారిని అడ్డుకునే సాహసం చేయలేక ఊరుకున్నారు. బాంబులు పేలుతుంటే టీడీపీ అభిమానులు జెండాలు పట్టుకుని డ్యాన్స్‌లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Telugudesam
Celebrations
Sakshi Head Office
Hyderabad

More Telugu News