మూడోసారి ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు... ఇదొక చారిత్రక ఘట్టం: ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ
- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పదేళ్లుగా చేసిన మంచి పనులను కొనసాగిస్తామని హామీ
- ఒడిశా ప్రజలకు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ థ్యాంక్స్
- కార్యకర్తల కష్టాన్ని మాటల్లో చెప్పలేమన్న మోదీ
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 147 స్థానాలకు గాను బీజేపీ 78 సీట్లు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రజలకు కూడా ప్రధాని మోదీ థ్యాంక్స్ చెప్పారు. సుపరిపాలనకు, ఒడిశా ప్రత్యేక సంస్కృతికి సంబంధించిన అద్భుతమైన విజయం ఇది అన్నారు. ప్రజల కలలను నెరవేర్చడంలో, ఒడిశాను ప్రగతిపథంలో కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడంలో బీజేపీ ఏ అంశాన్ని వదిలి పెట్టదని హామీ ఇచ్చారు. ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలను చూసి గర్విస్తున్నానన్నారు.