ఈ వారం థియేటర్లకు వస్తున్న సినిమాలివే!
- ఈ నెల 7వ తేదీన విడుదలవుతున్న 'మనం'
- అదే రోజున థియేటర్లకు వస్తున్న 'సత్యభామ'
- పాయల్ ప్రధాన పాత్రగా రానున్న 'రక్షణ'
- నవదీప్ హీరోగా చేసిన 'లవ్ మౌళి'
'మనం' తరువాత 'సత్యభామ'పై బజ్ ఎక్కువగా ఉంది. ఇది కాజల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఆమె ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై చాలామందిలో ఆసక్తి ఉంది. అందుకు కారణం ఒకదాని తరువాత ఒకటిగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతూ రావడమే.
ఇక ఇదే రోజున మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ థియేటర్లలో అడుగుపెట్టనుంది .. అదే 'రక్షణ'. ఈ సినిమాలో పాయల్ ప్రధానమైన పాత్రను పోషించింది. పోలీస్ ఆఫీసర్ గా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. ఇక నవదీప్ ప్రధానమైన పాత్రను పోషించిన 'లవ్ మౌళి' కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ నాలుగు సినిమాలలో ఏది ఎక్కువ మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.