జేసీ దివాకర్ రెడ్డి సంతకం ఫోర్జరీ.. సాహితి నిర్మాణ సంస్థపై కేసు
- తన సంతకం ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన జేసీ
- జూబ్లీహిల్స్ లోని నివాసం అద్దె ఒప్పందం విషయంలో వివాదం
- లీజ్ ముగిసినా ఇల్లు ఖాళీ చేయకపోవడంతో కోర్టుకెక్కిన జేసీ దివాకర్ రెడ్డి
2023 మే నెలతో ఒప్పంద గడువు ముగియడంతో ఇల్లు ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా లక్ష్మీనారాయణ స్పందించలేదు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తమకు లీజు గడువు ఇంకా ఉందంటూ లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సాత్విక్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు జేసీకి సమన్లు పంపింది. సాహితి నిర్మాణ సంస్థ యాజమాన్యం కోర్టులో దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన జేసీ.. వాటిలో ఒప్పందం తేదీ 2021 మే నెలగా మార్చినట్లు గుర్తించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ పత్రాలను తయారుచేసినట్లు ఆరోపించారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.