సుప్రీం కోర్టులో అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు!
- బెయిల్ పొడిగింపు పిటిషన్‌పై తక్షణ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరణ
- పిటిషన్ లిస్టింగ్‌పై తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ
- ప్రధాన బెంచ్ ముందు పిటిషన్ ప్రస్తావన ఎందుకు తేలేదని ప్రశ్న
అయితే, వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన బరువు నెల రోజుల వ్యవధిలో అకారణంగా 7 కేజీల మేర తగ్గిందన్నారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్ స్కాన్ సహా పలు ఇతర వైద్య పరీక్షల కోసం ఏడు రోజుల సమయం పడుతుందని, ఇందుకు అనుగుణంగా బెయిల్ పొడిగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్టు తెలిపారు. మే 10 న ఆయన తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.