హర్యానాలో ఫ్లైఓవర్ ప్రమాదం.. ఊడిపడ్డ 700 మీటర్ల డ్రెయిన్ పైప్.. వాహనదారులకు తీవ్ర గాయాలు
- హర్యానాలోని కర్నాల్ లో జాతీయ రహదారి 44పై ఘటన
- ధ్వంసమైన వాహనాలు.. భారీ పైప్ లైన్ కావడంతో పక్కకు జరపలేకపోయిన స్థానికులు
- ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన పోలీసులు
గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా, ఆ భారీ ఇనుప పైప్ ను వారు పైకి లేపలేకపోయారు. చివరకు ప్రమాదవార్త అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
ఎలివేటెడ్ హైవేకు సమాంతరంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ పాతది కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.