అయినా వీరు మారలేదు! బాలుడు కారు నడుపుతుంటే బానెట్‌పై కూర్చున్న యువకుడు.. వీడియో ఇదిగో
- ముంబైలోని శివాజీ చౌక్ వద్ద ఘటన
- వీడియో వైరల్ అయిన వెంటనే స్పందించిన పోలీసులు
- బాలుడి తండ్రి అరెస్ట్.. నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్‌పై కేసు
తాజాగా, ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే ప్రమాదం జరగలేదంతే. ఓ బాలుడు ఖరీదైన కారును నడుపుతుంటే మరో యువకుడు కారు బానెట్‌పై కూర్చొన్నాడు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన శివాజీ చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. బాలుడు బీఎండబ్ల్యూ కారు నడుపుతుంటే శుభమ్ మితాలియా అనే మరో యువకుడు దర్జాగా కారు బానెట్‌పై కూర్చొన్నాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు బాలుడికి కారు ఇచ్చినందుకు అతడి తండ్రిని అరెస్ట్ చేశారు. బానెట్‌పై కూర్చున్న యువకుడిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలిసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.