అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

Telangana women dead in American road accident
  • మృతురాలిని గుంటిపల్లి సౌమ్యగా గుర్తింపు
  • యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువతి
  • స్వగ్రామం యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లె
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతి దుర్మరణం చెందారు. మృతురాలిని గుంటిపల్లి సౌమ్యగా గుర్తించారు. ఆమె స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట సమీపంలో గల యాదగిరిపల్లె.  ఈ ఘటన న్యూయార్క్‌ నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

యాదగిరిపల్లికి చెందిన సౌమ్య (25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడి అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతోంది. చదువుకుంటూనే ఆమె పార్ట్ టైమ్‌ ఉద్యోగం చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌమ్య అక్కడికక్కడే మృతి చెందింది.  
Go Back to Shorts
Road Accident
USA
Yadadri Bhuvanagiri District

More Telugu News