84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాసి చరిత్ర సృష్టించిన ప్రపంచ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు!
- ఆయుర్వేద వైద్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రకాశ్ ఇండియన్ టాటా
- తొలుత ఐదో తరగతి పరీక్షలు.. ప్రస్తుతం ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రకాశ్
- అమితాబ్ బచ్చన్, సనత్ జయసూర్య సహా పలువురు ప్రముఖులకు వైద్యం
- 112 దేశాల్లో వైద్య సేవలు
ఆయన సాధారణ ఆయుర్వేద వైద్యుడేమీ కాదు. ఆయనకు ఎంతో పేరుంది. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, శిల్పాశెట్టి సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఎంతోమంది విదేశీ వ్యాపారవేత్తలకు సేవలు అందించారు. శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యకు కూడా ఆయన వైద్యం చేశారు. మొత్తం 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు కూడా ఆయుర్వేద వైద్యం చేశారు. ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్న ఆయనను చూసిన విద్యార్థులు నోరెళ్లబెడుతున్నారు.