తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం... ఉమ్మడి రాజధానిపై చర్చించవద్దన్న ఈసీ
- కేబినెట్ మీటింగ్ కు షరతులు విధించిన ఈసీ
- జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్
- రైతు రుణమాఫీపై చర్చించవద్దని షరతు
అయితే ఈ భేటీకి ఈసీ కొన్ని షరతులు విధించింది. కేవలం జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్ పెట్టింది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలపై చర్చించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో... విద్యా సంస్థల్లో వసతులు, ధాన్యం కొనుగోళ్లు, మేడిగడ్డ బ్యారేజ్ తదితర ప్రధాన అంశాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగుతోంది.