ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- ఎన్నికల ప్రచారం నిమిత్తం బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సోరెన్ పిటిషన్
- సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు లిస్టింగ్ చేయాలని ఆదేశాలు
- ఈ నెల 21న పిటిషన్‌పై విచారణ జరపనున్న ధర్మాసనం
దీనిని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు లిస్టింగ్ చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ నెల 21న ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది. భూకుంభకోణం కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. తన అరెస్టును ఆయన ఝార్ఖండ్ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.