కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుంది: మల్లు భట్టివిక్రమార్క ధీమా
- భూపాలపల్లి జిల్లా ధన్వాడలోని దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు
- ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అర్థమవుతోందని వ్యాఖ్య
- రాహుల్ గాంధీ బస్సు యాత్ర, పాదయాత్రతో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని ధీమా
రాహుల్ గాంధీ చేసిన బస్సుయాత్ర, పాదయాత్రతో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమికి ప్రజలు ఓట్ల ద్వారా ఆదరణ చూపిస్తున్నారన్నారు. కొన్ని పార్టీలు అన్ని భావజాలాలను పక్కనపెట్టి ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి చూశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మాత్రం ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారన్నారు.