చెన్నైపై ఈ సమీకరాణాలతో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు ఆర్సీబీ
- ఇరు జట్లకు చావో రేవోగా మారనున్న మ్యాచ్
- బెంగళూరు ప్లే ఆఫ్స్ ఆశలన్నీ సన్ రైజర్స్ ఆటతీరుపైనే ఆధారం
- హైదరాబాద్ జట్టుకు ఉన్న రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచినా బెంగళూరుకు సగం చాన్స్
- అప్పుడు చెన్నైపై 18 పరుగుల తేడాతో లేదా 11 బంతులు మిగిలి ఉండగానే గెలిస్తే ప్లే ఆఫ్స్ కు వెళ్లనున్న బెంగళూరు
సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ భవితవ్యం..
ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లోకి చేరుతుందా లేదా అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటతీరుపై ఆధారపడనుంది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్ లలో 7 గెలిచి 14 పాయింట్లు గెలుచుకుంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ + 0.406గా ఉంది. సన్ రైజర్స్ చివరి రెండు మ్యాచ్ లను వరుసగా గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచినా మెరుగైన రన్ రేట్ కారణంగా సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ లో మూడో స్థానంలోకి చేరుకుంటుంది. ఒకవేళ అదే జరిగితే చెన్నైతో మ్యాచ్ ఆర్సీబీకి నాకౌట్ మ్యాచ్ కానుంది.
ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లో నిలవాలంటే..
ఫాఫ్ డూ ప్లెసీ నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 పరుగులకు పైగా సాధించాలి. అలాగే చెన్నైపై 18 పరుగులకన్నా ఎక్కువ రన్స్ తేడాతో ఓడించాలి. ఒకవేళ చెన్నై తొలి బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే బెంగళూరు జట్టు మరో 11 బంతులు ఉండగానే 201 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయాలి.