గంభీర్‌కు అభిమాని రిక్వెస్ట్.. ఎట్టి పరిస్థితిలోనూ ఆ పని చేయొద్దని ఎమోషనల్.. వీడియో వైరల్!
- ముంబైతో మ్యాచ్‌కు ముందు మెంటార్ గౌతం గంభీర్‌తో కేకేఆర్ ఫ్యాన్ మీట్
- 2018లో కేకేఆర్‌ను వదిలి పెట్టి వేరే ఫ్రాంచైజీకి వెళ్లిన గౌతం గంభీర్
- ఈ ఏడాది తిరిగి కోల్‌కతా జట్టుతో చేరిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎమోషనల్ అయిన అభిమాని
- ఎట్టిపరిస్థితిలో మళ్లీ కేకేఆర్ ఫ్రాంచైజీని వదిలి పెట్టొదని గౌతీతో ఫ్యాన్ మొర
"గౌతీ భయ్యా.. మేము నిన్ను కోరుకునేది ఒక్కటే. నువ్వు ఎప్పటికీ మమ్మల్ని వదిలి పెట్టి వెళ్లొద్దు. గతంలో మీరు కోల్‌కతాను వదిలి వెళ్లినప్పుడు మా గుండె పగిలింది. ఆ బాధను మాటల్లో చెప్పలేం. మీ కోసం ఓ బెంగాలీ పాటను అంకితం చేద్దామనుకుంటున్నా. మిమ్మల్ని ఎల్లవేళలా మా పక్కనే ఉంచుకుంటాం. ఎప్పటికీ మమ్మల్ని వదిలిపెట్టొద్దు. మీరు మా హృదయం. ప్లీజ్ సర్" అంటూ ఆ అభిమాని కోరారు. ఆ ఫ్యాన్ మాటలకు గౌతం గంభీర్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోను కేకేఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.