జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. ఒక్క ప్లాన్‌తో ఏకంగా 15 ఓటీటీలు
- రూ. 888తో పోస్టుపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన జియో
- 30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా
- 800 డిజిటల్ టీవీ చానళ్లు కూడా
- ఈ నెల 31తో ముగియనున్న ఆఫర్
ఈ ప్లాన్‌లో యూజర్లకు 30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, బేసిక్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ వంటి 15 ఓటీటీ యాప్స్ లభిస్తాయి. వీటికి అదనంగా 800 డిజిటల్ టీవీ చానళ్లను చూడొచ్చు. ఐపీఎల్ ధన్‌ధనా ఆఫర్ కూడా దీనికి వర్తిస్తుంది. 50 రోజులపాటు జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కస్టమర్లు ఉచితంగా ఈ సేవలు పొందవచ్చు. ఈ నెల 31తో ఆఫర్ ముగుస్తుంది.