తప్ప తాగి బార్ బయట పోలీసులపై యువతుల దాడి!
- ముంబై శివార్లలోని విరార్ లో ఘటన.. నెట్టింట వీడియో వైరల్
- అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
- న్యాయస్థానం ఆదేశంతో జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు
ముంబైలోని విరార్ ప్రాంతంలో ఉన్న గోకుల్ టౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బార్ అండ్ రెస్టారెంట్ బయట ముగ్గురు యువతులు హంగామా చేస్తున్నారంటూ కొందరు స్థానికులు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు.
కానీ నిషా తలకెక్కడంతో ఆ యువతులు పోలీసులతో తొలుత వాగ్వాదానికి దిగారు. ఇష్టం వచ్చినట్లుగా వారిని దుర్భాషలాడారు. ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ చెయ్యి కొరకడమే కాకుండా ఆమె యూనిఫాంను చించేశారు. మరో కానిస్టేబుల్ తలపై బకెట్ తో బాదారు. అలాగే అతని చేతినీ కొరికారు. నిందితులను కావ్య, అశ్వని, పూనంగా గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
https://www.ndtv.com/video/embed-player/?id=783106