గంటా ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్... టీడీపీకి ఓటేయాలన్న నమిత

Namitha attends Ganta road show in Bhimili
విశాఖలో భీమిలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, ఆయన తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తన ఎన్నికల ప్రచారానికి గంటా సినీ గ్లామర్ ను కూడా జోడించారు. ప్రముఖ నటి, బీజేపీ నేత నమితను కూడా తన క్యాంపెయిన్ కు తీసుకువచ్చారు. 

గంటా భీమిలి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో నమిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండీ అంటూ ప్రసంగం ప్రారంభించారు. బాగున్నారా, భోంచేశారా? అని పలకరించారు. 

మీకు అభివృద్ధి కావాలా...? అని ప్రశ్నించారు. అభివృద్ధి కావాలంటే మీరు సైకిల్ గుర్తుకు ఓటేయండి అని నమిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె జై బాలయ్య, జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్, జై గంటా శ్రీనివాసరావు గారు అంటూ నినాదాలు చేసి కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకువచ్చారు. 

అంతకుముందు గంటా ప్రసంగిస్తూ, నమిత సినీ నటి మాత్రమే కాదని, తమిళనాడులో ప్రముఖ బీజేపీ నాయకురాలు అని వెల్లడించారు. ఆమె స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా ఉన్నారని తెలిపారు.
Go Back to Shorts
Namitha
Ganta Srinivasa Rao
Road Show
Bhimili
Visakhapatnam
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News