అమెరికా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ విడుదల

US student visa interview dates released
  • ఈ నెల 31 వరకూ ఎంబసీతో పాటు కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు
  • అవసరాన్ని బట్టి ఆగస్టు నెల వరకూ డేట్స్ విడుదలకు ప్రణాళికలు
  • దశలవారీగా డేట్స్ అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా నిర్ణయం 
  • అనంతరం, పర్యాటక వీసాలు అందుబాటులోకి
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేశాయి. ఫాల్ సీజన్ అడ్మిషన్లకు అనుగుణంగా అమెరికా ప్రభుత్వం ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్స్‌ను మంగళవారం విడుదల చేసింది. రాజధాని ఢిల్లీలోని అమెరికా ఎంబసీతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతాల్లోని కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. ఈసారి భారీగా స్లాట్లు అందుబాటులోకి తేవాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

దశలవారీగా స్లాట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అమెరికా కాన్సులేట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. జూన్ నెల స్లాట్లు ఈ నెల మూడో వారంలో, ఆ తరువాత జులై, అవసరాన్ని బట్టి ఆగస్టు నెల ఇంటర్వ్యూ తేదీలనూ విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. 

విద్యార్థుల రద్దీ దృష్ట్యా రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్ కార్యాలయాల్లో ఈ నెల 19, 26 తేదీల్లో ఇంటర్వ్యూ స్లాట్లను రెడీ చేశారు. వీసా జారీలో భాగంగా తొలుత విద్యార్థుల వేలిముద్రలు సేకరించి, అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

విద్యార్థి వీసాల జారీ అనంతరం పర్యాటక వీసాలు (బీ1, బీ2) అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ రెండో వారంలోగా విద్యార్థి వీసాల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్‌లో పర్యాటక వీసా స్లాట్ల జారీ అవనున్నట్టు తెలుస్తోంది. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే పర్యాటక వీసా ప్రక్రియ పూర్తి చేయాలనేది అక్కడి ప్రభుత్వ ఆలోచనగా ఉంది.
Advertisement
USA
Student Visa
Interview Dates

More Telugu News