Dharmapuri Arvind: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: ధర్మపురి అర్వింద్ జోస్యం

MP Arvind says Revanth reddy government will collapse
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన జక్రాన్‌పల్లి సమావేశంలో మాట్లాడుతూ... జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగువుతుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారని... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్‌ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. నరేంద్ర మోదీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని... భారత ముస్లింలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే.. ఏడాదిలో జక్రాన్‌పల్లి ఎయిర్‌ఫోర్టు పూర్తి చేస్తామని తెలిపారు.
Go Back to Shorts
Dharmapuri Arvind
BJP
Revanth Reddy

More Telugu News