ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై ఈసీ వేటు
- టీడీపీ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలు
- అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి బదిలీ
- రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషా పైనా వేటు
నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ టీడీపీ జిల్లా నేతలను జైలు పాలు చేశారని ఆరోపించింది. ఇటీవల టీడీపీ నేతపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. దీనిపై టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం.. డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై వేటు వేసింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటీ డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషా పైనా వేటు వేసింది. ఈ ఇద్దరు అధికారులను వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. తమ సబార్డినేట్స్ కు ఛార్జ్ అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని డీజీపీ మెమోరాండం రిలీజ్ చేశారు.