వాలంటీర్లను ఉద్దేశించి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
- వాలంటీర్లు రాజీనామా చేయాలన్న దువ్వాడ శ్రీనివాస్
- వైసీపీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారం చేయాలని వ్యాఖ్య
- మాట వినని వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిక
ఇప్పుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ 5వ తేదీ నుంచి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని దువ్వాడ అన్నారు. ప్రతి వాలంటీర్ రాజీనామా చేసి, వైసీపీ కండువా కప్పుకుని ప్రచారం చేయాలని చెప్పారు. తమ మాట వినని వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. టెక్కలిలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నెల 10వ తేదీన వాలంటీర్ల విధులపై హైకోర్టు తీర్పును వెలువరించనుంది.