భూమి బరువు ఎందుకు తగ్గుతుంది?.. ఎందుకు పెరుగుతుంది?
- భూమి బరువు 5.9722 సెప్టీలియన్లు
- అంతరిక్షం నుంచి ప్రతి ఏడాది అదనంగా వచ్చి చేరుతున్న 40 వేల టన్నుల బరువు
- అదే సమయంలో అంతరిక్షంలో కలుస్తున్న వేల టన్నుల భూమి బరువు
భూగోళం అంత బరువుందన్న సంగతి ఎలా తెలిసింది? దానిని తూచేందుకు అంతపెద్ద కాంటాను ఎక్కడి నుంచి తెచ్చారు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. భూమి గ్రావిటీ, పరిమాణం, ఉపరితల వైశాల్యం, భూమిలోని పదార్థాలను శాస్త్రీయంగా గణించి ఈ లెక్క తేల్చారు శాస్త్రవేత్తలు. అయితే, ఈ బరువు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎందుకలా? అంతరిక్షం నుంచి నిరంతరం ధూళి, చిన్నచిన్న గ్రహశకలాలు నిత్యం భూమిని చేరుతూనే ఉంటాయి. ఈ కారణంగా ఏటా భూమి బరువు 40 వేల టన్నుల మేర పెరుగుతోంది. అదే సమయంలో భూమి బరువు కూడా తగ్గుతూ ఉంటుంది. దీనికి కారణం.. భూమి వాతావరణం లోనుంచి అంతరిక్షంలోకి లీకయ్యే వాయువులు, పదార్థాలతో వేల టన్నుల మేర బరువు తగ్గుతూ ఉంటుంది. ఇక, భూమ్మీద ఉన్న మానవ నిర్మిత కట్టడాల్లో ఈజిప్టులోని పిరమిడ్ అన్నింటికంటే బరువైనది. ఇది ఏకంగా 480 కోట్ల కిలోలు.