తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇదీ... అంటూ 'గాడిద గుడ్డు' గుర్తును ఏర్పాటు చేసిన కాంగ్రెస్

This is given by BJP To Telangana
  • హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీ బ్యానర్ ఏర్పాటు
  • కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఇవ్వలేదన్న కాంగ్రెస్
  • పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని వెల్లడి
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఇచ్చింది 'గాడిద గుడ్డు' అంటూ హైదరాబాద్‌‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు అడిగినవి... అంటూ అందులో పేర్కొన్నారు. 'తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇది..' అంటూ దీనిని ట్వీట్ చేసింది.

రూపాయి పంపిస్తే 43 పైసల బిచ్చం నుంచి విముక్తి, మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా, కనీసం ఒక్క ఐఐఎం, ఎన్ఐడీ విద్యాలయం, కనీసం ఒక్క ఐఐఎం, మెడికల్ కాలేజీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకుకు జాతీయ హోదా, బడ్జెట్‌లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, 811 టీఎంసీ కృష్ణా జలాల్లో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్ అడిగినట్లు ఆ ఫ్లెక్సీలో పేర్కొంది. అయితే బీజేపీ ఇచ్చింది మాత్రం 'గాడిద గుడ్డు' అంటూ ఓ గుడ్డు గుర్తును కూడా అక్కడ ఏర్పాటు చేసింది.
Advertisement
BJP
Telangana
Congress
Lok Sabha Polls

More Telugu News