Telangana: అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక

షార్ట్స్‌లో చూడండి
అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. పొడి వాతావరణం కారణంగా కొన్నిరోజుల కంటే ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశముందని పేర్కొంది. ఆదివారం అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఎండలు గత ఏడాది కంటే ఈసారి మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది.
Go Back to Shorts
Telangana
IMD

More Telugu News